గురుపౌర్ణమి సందర్భముగా జమ్మిగడ్డలొని శ్రీ సాయిదత్త మందిరంలో ఉదయం నుండి ప్రత్యేక అభిషేకములు, పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపకులు రవీంద్రబాబు, అర్చకులు రమణ శాస్త్రి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణం నుండి ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి పురస్కరించుకొని గణపతి పూజ, కాగడ హారతి గురుపూజోత్సవ కార్యక్రమాలతో పాటు శ్రీసాయి సత్యవ్రతము వ్రతం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వ్రత అనంతరం అన్నప్రసాద వితరణ జరుగును. ఆదివారం జరిగే కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గురువుల అనుగ్రహం పొందగలరని కోరారు.