ఆదర్శ పాఠశాలలో గురుపూజోత్సవం..

నవతెలంగాణ- రెంజల్

మండల కేంద్రమైన రెంజల్ ఆదర్శ పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ న్ జయంతిని పురస్కరించుకొని పాఠశాల యాజమాన్యం గురుపూజోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బలరాం మాట్లాడుతూ అత్యున్నత భారత రాష్ట్ర పదవిని చేపట్టడంతో పాటు విద్యార్థులను ఘనత సర్వేపల్లి రాధాకృష్ణన్ కే దక్కిందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.