– ట్రిబ్ కన్వీనర్ మల్లయ్య బట్టు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఆర్‌ఈఐ-ఆర్‌బీ) జారీ చేసిన వివిధ నోటిఫికేషన్‌ల ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ ఈనెల 24 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ట్రిబ్ కన్వీనర్ డాక్టర్ మల్లయ్య బట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అభ్యర్థులు వెబ్‌సైట్‌లో పరీక్షల తేదీలను పరిశీలించి వారు దరఖాస్తు చేసిన పరీక్షకు వారం రోజుల ముందు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. వచ్చేనెల ఒకటి నుంచి 23వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్షల హాల్‌టికెట్లు ఈనెల 24 నుంచి అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. హాల్‌టికెట్ల కోసం www.treirb.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.