జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఉప్పల్ వాయి సాంఘిక సంక్షేమ గురుకుల క్రీడాకారులు ఎంపికైనట్లు బుధవారo గురుకుల ప్రిన్సిపాల్ శివరాం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల డిసెంబర్ లో ఖమ్మం, నాగర్ కర్నూల్ లో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్-అండర్ 14, ప్రాస స్థాయి క్రాస్ కంట్రీ అథ్లెటిక్స్ పోటీల్లో ఉపల్వాయి గురుకులనికి చెందిన కే ప్రవీణ్, కే సంకేత్, ఏ దిల్సన్, డి సంతోషులు బంగారు పథకాన్ని సాధించి, ఈనెల 11 నుండి 14వ తేదీ వరకు జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొనున్నట్లు తెలిపారు. క్రీడాకారులను ప్రిన్సిపాల్ తో పాటు, ఉపాధ్యాయ, అధ్యాపక బృందం అభినందించారు.