రాష్ట్ర స్థాయి అండర్ -14 ఫుట్‌బాల్ పోటీలకు గురుకుల విద్యార్థులు ఎంపిక

నవతెలంగాణ- ఆర్మూర్: ఈ నెల  10 న  పట్టణంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల  లో అండర్ -14  ఫుట్ బాల్ సెలక్షన్స్ నిర్వహించారు.  ఇందులో మంచి ప్రతిభ కనబరిచారు రాష్ట్ర స్థాయి అండర్ -14 ఫుట్‌బాల్ పోటీలలో  గురుకుల పాఠశాల కు చెందిన విద్యార్థులు టి.సుశాంత్ కే. కార్తీక్  రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ ఏ. దుర్గారెడ్డి గురువారం తెలిపారు ఈనెల  17,18,19 తేదీల్లో  గద్వాల్ జోగులాంబ లో రాష్ట్ర పోటీలలో పాల్గొనడం జరుగుతుందని. ఆర్మూర్ సాంఘిక సంక్షేమ వైస్ ప్రిన్సిపల్ సంధ్యారాణి. శ్రీధర్. షీలా రాణి. స్వామి. రవి. గంగాధర్. చిన్నయ్య. సురేష్. చెన్నారెడ్డి. వ్యాయామ ఉపాధ్యాయుల కే. రాజేందర్. అర్జున్ కళాశాల పాఠశాల టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ బృందం స్టూడెంట్స్ ను అభినందించారు.