గురుకుల ఉపాధ్యాయ నిరసన..

నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గురుకులాల ఉమ్మడి టైం టేబుల్  ఉపాధ్యాయుల పైన తీవ్రమైన ఒత్తిడి కలిగించేలా, విద్యార్థుల పైన మానసిక ఒత్తిడి కలిగించేలా ఉందని ఎస్ఎల్బిసి నల్లగొండ లో గల మైనారిటీ గురుకుల పాఠశాలలో టియస్ యుటిఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో భోజన విరామంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ టైం టేబుల్ వల్ల విద్యార్థులు మానసిక ఆందోళన తో విద్యకు దూరమయేటువంటి అవకాశం ఉంది. కావున టైం టేబుల్ వెంటనే ఉపసంహరించుకొని గతంలో ఉన్న టైం టేబుల్ కొనసాగించాలని జిల్లా యుటిఎఫ్ అధ్యక్షులు ఎడ్ల సైదులు,  యుటిఎఫ్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి పెరిక శంకర్ లు డిమాండ్ చేశారు.ఉమ్మడి గురుకులాల నూతన టైం టేబుల్ వెంటనే ఉపసంహరించుకోవాలి,  ఉపాధ్యాయుల ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లలో మహిళల సీనియార్టీని కామెంట్ ఉమెన్ సీనియార్టీ లిస్టు ద్వారా నియామకాలు జరపాలి. జీవో 317 ప్రకారం జోనల్ కేటాయింపులో సీనియార్టీ లోపాలు, ఎస్సీ, ఎస్టీ  కేటాయింపులో జరిగిన లోపాలు సవరించాలని డిమాండ్ చేశారు. నూతన ఉద్యోగులు రావడం వల్ల , కలెక్టర్ ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ఒప్పంద ప్రాతిపదికను  నియమితులై గత 15 సంవత్సరాలుగా జనరల్ సొసైటీలో ఉంటూ మైనార్టీ సొసైటీలో పనిచేస్తున్న  ఉర్దూ టీచర్లు, హిందీ టీచర్లు ఉద్యోగ భద్రత కోల్పోతున్న వారిని కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా గుర్తిస్తూ ఆయా స్థానాల్లో కొనసాగించాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో పాఠశాల కో ఆర్డినేటర్ కొత్త సైదులు,  నల్గొండ మైనారిటీ గురుకుల ఉపాధ్యాయ పాఠశాల బృందం పాల్గొన్నారు.