గురుకులాలు పిలుస్తున్నాయి..

Gurukuls are calling..– ఫిబ్రవరి 23న ప్రవేశ అర్హత పరీక్ష..

– దరఖాస్తులు స్వీకరిస్తున్నాం ప్రిన్సిపల్ అంజయ్య..
నవతెలంగాణ – అచ్చంపేట 
2025 -26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్సీ ,ఎస్టీ ,బీసీ ,మైనార్టీ జర్నల్ గురుకులాల పాఠశాలల్లో 5వ తరగతి 9వ తరగతి లలో అడ్మిషన్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ తీగల అంజయ్య శనివారం పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం కొన్ని మార్పులు చేసిందని తల్లిదండ్రులు సంరక్షకులు అవగాహన చేసుకుని గమనించుకోవాలని సూచించారు.  ఇంతకుముందు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఉంటే చాలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆన్లైన్ దరఖాస్తు వెంటనే కులం ఆదాయం ఇతర సర్టిఫికెట్లు అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నారు. ప్రస్తుతము నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 2 తేదీ వరకు పూర్తిగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. జత చేయవలసినవి కులం ,ఆదాయం సర్టిఫికెట్లు,  గ్రామీణ ప్రాంతాల వారి  ఆదాయం రూ 1,50,000/-పట్టణ వాసుల వారి ఆదాయం రూ 2 లక్షల లోపు ఉండాలి. బర్త్ సర్టిఫికెట్ బోనం ఫైర్డు , ఆధార్ కార్డ్, ఇవాళ దిగిన పాస్ ఫోటో,లు ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుందని ప్రిన్సిపల్ సూచించారు.