– ఇరుకు గదుల్లో మగ్గుతున్న విద్యార్ధులు..
– పాఠశాలలు ఒకచోట కళాశాలలు మరోచోట..
– భవనాలు నిర్మించాలని కోరుతున్న తల్లిదండ్రులు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ చిత్రాలను చూస్తుంటే జైలో లేక అంతర్జాతీయ వ్యాపార సముదాయ భవనాలో అనిపిస్తుంది కదూ. తెలియని వాళ్ళు దూరంగా ఉండి చూస్తే నిజంగా అంతే అనుకుంటారు. అనుకోవడం కాదు నిజంగా వాటిని పోలిన భవనాలే. కానీ ఇవి గురుకుల పాఠశాలలు నిర్వహిస్తున్న అద్దె భవనాలు అండోయ్.. గురుకులాలు అంటే ఒకప్పుడు పెద్ద పెద్ద భవనాలు,విశాల గదులు,చుట్టూ క్రీడా మైదానం,ఆహ్లాదం కోసం చెట్టూ సేమ వెరసి ప్రశాంత వాతావరణంలో విద్యాబోధన జరిగే విద్యాలయాలు. మరి నేడు జన రద్దీ కూడలి లు,పెద్ద పెద్ద వ్యాపార భవనాలు, ఇరుకు గదులు, చాలీ చాలని మరుగుదొడ్లు, తరగతి గదులే వసతి గదులు. అందులో మగ్గుతున్న విద్యార్ధులు. నలుగురు ఉండే కుటుంబ సభ్యులు నివసించే ఇంట్లోనే ఓ రెండు రోజులు అదనంగా బంధువులు వసతి పొందితే ఎన్ని ఇబ్బందులో మనందరికి అనుభవమే.కానీ చాలీ చాలని గదుల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు వారి బాధలు వర్ణించి గలమా.. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో మొత్తం మూడు గురుకుల పాఠశాలలు,వీటి అనుబంధం కళాశాలలు ఉన్నాయి. ఈ విద్యా సంస్థల ప్రిన్సిపాల్ లు సంగీత,స్వప్న,మంజుల తెలిపిన వివరాలు ప్రకారం వాటిల్లోని సౌకర్యాలు,అసౌకర్యాలు.
అద్దె భవనాల్లో గురుకులాలు..
టి.ఎం.ఆర్.ఎస్ (బాలికలు):
ఈ గురుకులం 2017 – 18 విద్యాసంవత్సరం లో మంజూరి అయింది.ఇందులో 5 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు 240 మంది విద్యార్ధిని లు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరికి తరగతి గదులు 6 తో పాటు,కార్యాలయం కు ఒకటి,విద్యార్ధుల సిక్ రూం కు ఒకటి,లైబ్రరీకి ఒకటి మొత్తం 10 గదులు అవసరం ఉంటుంది. వీటితో పాటు రెండు విశాలమైన భోజనం హాల్స్,వసతి కోసం మరో కొన్ని గదులు అవసరం ఉంటుంది. కానీ ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పూర్వ భవనాలు మరమ్మత్తులు,తాత్కాలికంగా చిన్న గాలులతో భవనాలు నిర్మించారు.
అనుబంధ కళాశాల:
దీనికి అనుబంధంగా జూనియర్ కళాశాల 2019 – 20 విద్యా సంవత్సరంలో ప్రారంభిం అయింది.ఎం.పీ.సీ,బై.పీ.సీ గ్రూపుల్లో మొత్తం 160 మంది విద్యార్ధిని లు చదువుతున్నారు.వీరికి తరగతి గదులు 4,కార్యాలయం ఒకటి,లైబ్రరీ,ల్యాబ్ లు కోసం పరిశోధనా గదులు 4 మొత్తం 10 గదులు ఉండాలి.భోజన హాల్స్ 2,వసతి గదులు 4 ఉండాలి.ఈ కళాశాల సైతం వ్యాపార నిమిత్తం నిర్మించిన అద్దె భవనం లోనే నిర్వహిస్తున్నారు.ఈ పాఠశాల,కళాశాల కోసం మండల పరిధిలోని భీముని గూడెంలో ప్రభుత్వం స్థలం కేటాయించింది.కానీ విద్యాలయం ప్రారంభం అయి 8 సంవత్సరాలు అవుతున్నా శాస్వత భవనాలు నిర్మించలేదు.
ఎం.జె.పి.టి బి.సీ ఆర్ స్కూల్ (బాలికలు):
మహాత్మా జ్యోతీ రావు ఫూలే బ్యాక్ వర్డ్ రెసిడెన్షియల్ స్కూల్ 2017 – 18 విద్యాసంవత్సరం లో ప్రారంభించారు.ఇందులో 5 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు 480 మంది విద్యార్ధిని లు చదువుతున్నారు. ఇందులోనూ 12 తరగతి గదులు,రెండు భోజన హాల్స్,12 వసతి గదులు,కార్యాలయం,లైబ్రరీ,సిక్ రూం అవసరం ఉంటుంది. ఈ స్కూల్ సైతం వ్యాపారం నిమిత్తం నిర్మించిన బహుళ అంతస్తు భవనం లో ఇరుకు గదుల్లో నే మగ్గుతున్నారు. ఈ పాఠశాల ఇప్పటికే మూడు భవనాల్లో కి మార్చారు.అయినా సరైన వసతి పొందలేకపోతున్నారు.
అనుబంధ కళాశాల :
2021 – 22 విద్యాసంవత్సరం లో ప్రారంభం అయింది. ఈ సంవత్సరం ఇక్కడే నిర్వహించిన పంచిపెట్టి కీ వసతి గదులు లేక ఒక సంవత్సరం దుమ్ముగూడెం, ఈ ఏడాది భద్రాచలం లో నిర్వహిస్తున్నారు.
ఎం.జె.పి.టి బీ.సీ డబ్ల్యు.ఆర్ స్కూల్ (బాలురు):
మహాత్మ జ్యోతి రావు ఫూలే బ్యాక్ వర్డ్ రెసిడెన్షియల్ బాలురు స్కూల్ 2019 – 20 విద్యాసంవత్సరం ప్రారంభం అయింది.ఇందులోనూ 5 వ తరగతి నుండి 10 తరగతి వరకు 480 మంది బాలురు చదువుతున్నారు.వీరికి 12 తరగతి గదులు,12 వసతి గదులు,రెండు భోజన హాల్స్,సిక్ రూం,కార్యాలయం రూం,లైబ్రరీ గదులు అవసరం ఉంటుంది.ఇది సైతం అద్దె భవనంలో ఇరుకు గదులే.ఈ పాఠశాలను ఇప్పటికే రెండు చోట్లకు మార్చారు.గతేడాది 8,9 తరగతులను ఖమ్మం జిల్లా,వి.యం బంజరు కు తరలించారు.ఈ ఏడాది ఇంటర్ కళాశాల నిర్వహించాల్సి ఉన్నప్పటికి వసతి సదుపాయం లేకపోవడంతో అన్నపు రెడ్డి పల్లి లో నిర్వహించడానికి సన్నహాలు చేస్తున్నారు. ఈ పాఠశాలలకు శాస్వత భవనాలు నిర్మించాలని,కళాశాలలను ఇక్కడే నిర్వహించేలా చర్యలు చేపట్టాలని విద్యార్ధులు తల్లిదండ్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క,మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,శ్రీనివాసరెడ్డి,ఎమ్మెల్యే ఆదినారాయణ లను కోరుతున్నారు.