ప్రతి ఒక్కరూ గురువులకు కృతజ్ఞత చెప్పుకునేందుకు జరుపుకునే పండుగ గురుపూర్ణమి అని మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక 18వ వార్డులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో గల సాయిబాబా మందిరంలో వార్డ్ కౌన్సిలర్ మాలోత్ కమల చంద్రునాయక్ ఆధ్వర్యంలో జరిగిన గురుపూర్ణమి ఉత్సవంలో ఆయన మాట్లాడారు. సనాతన హైందవ ధర్మంలో తల్లి, తండ్రి తర్వాత స్థానం గురువుకే దక్కిందన్నారు. పైగా ఈ సృష్టిలో మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతిక్షణం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడని పేర్కొన్నారు. అందులో కొంత తల్లిదండ్రుల వద్ద నేర్చుకుంటే మిగిలినదంత గురువు దగ్గరే నేర్చుకుంటాడని అన్నారు.ఈ సందర్భంగా గురు పౌర్ణమి పర్వదినానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు.అనంతరం గురు పౌర్ణమి ఉత్సవంలో పాల్గొని కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేనారెడ్డి తో కలిసి ఆయన స్వామివారి పల్లకి ని మోశారు.ఈ సందర్భంగా మందిరంలో ఏలే వేణుగోపాల్, జయమ్మ ల కుమారులు ఉపేందర్ ,యామిని లు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.