భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో శివశక్తి శిరిడి సాయి అనుగ్రహ మహాపీఠంలో సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి ఆధ్వర్యంలో గురుపౌర్ణిమ సందర్భంగా క్షేత్రంలోని బంగారు శివలింగానికి అభిషేకం చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ పూజా కార్యక్రమాలు ధూప దీప నైవేద్యాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.