గుస్సాడీ కనకరాజు మరణం తీరనిలోటు

Gussadi Kanakaraj's death is a sad lossనవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహిత కనకరాజు మృతి గుస్సాడీ నృత్య కళాకారులకు, ఆదివాసి సమాజానికి తీరని లోటని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత రెడ్డి అన్నారు. జైనూర్ మండలం మర్లవాయి గ్రామంలో శనివారం కాంగ్రెస్ పార్లమెంట్ ఇంచార్జీ ఆత్రం సుగుణక్కతో కలిసి కనకరాజు పార్తివదేహానికి నివాళులర్పించి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయటంతో పాటు తెలంగాణ కళలను, సంస్కృతి సంప్రదాయాలను కాపాడిన కనకరాజు అసామాన్యుడని, ఆయన మరణం తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి, నవీన్ రెడ్డి, మావల మండల అధ్యక్షుడు చంద్రశేఖర్,యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, రంజిత్ పాల్గొన్నారు.