– వ్యక్తిపై కేసు నమోదు
నవతెలంగాణ-తాండూరు
వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్, తాండూరు పట్టణ పోలీసులు సోమవారం రాత్రి సంయుక్తంగా గాంధీ నగర్‌లోని ఓ ఇంటి వద్ద తెలంగాణ ప్రభుత్వం నిషేధించబడ ినటువంటి వివిధ రకాల గుట్కా ప్యాకెట్లును నమ్మదగ్గ సమాచారంతో దాడి నిర్వహించి గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా ప్యాకెట్ల విలువ సుమారు రూ. 80 వేలు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సంతోష్‌కుమార్ తెలిపారు.