దమ్ముంటే..ఆరోపణలను నిరుపించూ 

– ఆరోపణలు మానుకుని..హమీలు చెయి
– ఎమ్మెల్యే కవ్వంపల్లికి మాజీ ఎమ్మెల్యే రసమయి హెచ్చరిక 
నవతెలంగాణ – బెజ్జంకి 
బీఆర్ఎస్ ప్రభుత్వం,నాయకులపైన అసత్య ఆరోపణలు మానుకుని..దమ్ముంటే చేసిన ఆరోపణలను నిరుపించూ..అంటూ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హెచ్చరించారు.కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులపై ఎమ్మెల్యే కవ్వంపల్లి చేసిన అసత్య ఆరోపణలను శనివారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రసమయి ఖండించారు.ఈ సందర్భంగా రసమయి మాట్లాడారు.ప్రభుత్వ నిషేధిత భూములను అక్రమించుకని నాల అనుమతిగా మార్చుకుని మీ అనుచరులు విక్రయించుకుంటున్నారని దాంట్లో మీ వాట ఎంతో తెల్చాలన్నారు.అక్రమాలకు పాల్పడింది బీఆర్ఎస్ వాళ్లంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని..ఎవరు అక్రమాలకు పాల్పడుతున్నారో అంబేడ్కర్ సాక్షిగా విచారణ సిద్ధమా? సవాల్ చేశారు.అబద్దాల హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి హరీశ్ రావును విమర్శించే హక్కులేదన్నారు.ఇప్పటికైన అసత్య ఆరోపణలు మావుకుని అధికారం కోసం ఇచ్చిన హామీలను అమలు చేయలని లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హితవు పలికారు.ఎంపీపీ నిర్మల.మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.