మున్నూరు కాపు మండల అధ్యక్షులుగా గుట్ట గంగాధర్ ఏకగ్రీవ ఎన్నిక..

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల మున్నూరు కాపు మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం మండల కేంద్రంలో మున్నూరు కాపులు సమావేశమై కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మున్నూరు కాపు మండల అధ్యక్షుడిగా మండలంలోని లోలం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుట్ట గంగాధర్ ను ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా మాజీ ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, గడ్కోల్ శ్రీనివాస్ లను ఎన్నుకున్నారు.మండల కమిటీ
ఉపాధ్యక్షుడిగా సంస్థాన్ సిర్నపల్లి  గ్రామానికి చెందిన ఎల్ ఐ సి గంగాధర్, గన్నరం గ్రామానికి చెందిన ఉంగరాల శ్రీనివాస్, నల్లవెల్లి గ్రామానికి చెందిన సాంబార్ విఠల్, ప్రధాన కార్యదర్శిగా ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి  గ్రామానికి చెందిన సాధు రవి , సహాయ కార్యదర్శిగా మల్లాపూర్ గ్రామానికి చెందిన జల్లల శ్రీనివాస్, కోశాధికారిగా అమ్సన్ పల్లి గ్రామానికి చెందిన దొంతుల గంగాధర్,  తోపాటు సలహాదారులను, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గుట్ట గంగాధర్, కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ మండలంలో వేలాది సంఖ్యలో మున్నూరు కాపులు ఉన్నారని, వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎల్లవేళలా సాయ సహకారాలు అందజేస్తూ అందరి సహకారంతో సమస్యలను పరిష్కరించుకుంటా మన్నారు. తమపై నమ్మకం ఉంచి ఏకగ్రీవం చేసిన మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన మున్నూరు కాపులకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు నాయిడి రాజన్న, పులి సాగర్, బిఅర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పులి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ తేలు విజయ్ కుమార్, కచ్చకాయల శ్రీనివాస్, ధర్పల్లి ప్రభాకర్, దర్శపు గంగమోహన్, శీలం పెద్ద రాజన్న, పాల్దే శ్రీనివాస్, సాయి రెడ్డి శ్రావణ్, గట్టు కడారి, గోపు గోపాల్,తో పాటు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన మున్నూరు కాపులు పాల్గొన్నారు.