– మధ్యాహ్నం 2.00గం||ల నుంచి స్టార్‌స్పోర్స్‌లో
– నేడు పాకిస్తాన్-ఎ ఫైనల్
– ఎసిసి ఎమర్జింగ్ ఆసియాకప్
కొలంబో: ఎసిసి ఎమర్జింగ్ ఆసియాకప్ ఫైనల్లో మరో ఉత్కంఠ సమరం జరగనుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్-ఎ జట్టు పాకిస్తాన్-ఎతో తలపడనుంది. లీగ్ దశలో సునాయాసంగా పాకిస్తాన్-ఎను ఓడించిన భారత్.. సెమీస్‌లో బంగ్లాదేశ్-ఎపై గెలిచేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. సెమీస్‌లో ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించిందో అదే ప్రతిభనూ ఫైనల్లోనూ కనబర్చాల్సిన అవసరమెంతైనా ఉంది. బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీస్‌లో భారత్ 211పరుగులే చేసినా బంగ్లాదేశ్‌ను 160పరుగులకు కట్టడి చేసిన తీరు అమోఘం.
మరోవైపు పాకిస్తాన్ జట్టు శ్రీలంకపై భారీస్కోర్ చేసి దుర్భేధ్యఫామ్‌లో ఉంది. ఆ జట్టు శ్రీలంక-ఎపై 322పరుగులు చేసింది. ఆ జట్టుపై 60పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరింది. ఈ క్రమంలో పాక్ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇక భారత్-ఎ జట్టు టైటిల్‌ను సాధిస్తే రికార్డుస్థాయిలో 8వ సారి చేజిక్కించుకున్నట్లవుతుంది.