రెంజల్ ఇంచార్జ్ ఎంపీడీఓ గా హెచ్. శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ

నవతెలంగాణ – రెంజల్ 

రెంజల్ మండల ఇన్చార్జ్ ఎంపీడీవోగా హెచ్. శ్రీనివాస్, గురువారం బాధ్యతలను చేపట్టారు. గతంలో ఎంపీడీవో గా పని చేసిన శంకర్ నాయక్ శ్రీనివాస్ కు బాధ్యతలను అప్పగించారు. ఎడపల్లి ఎంపీడీవోగా వచ్చిన శంకర్, అక్కడ ఎంపీడీవో గా పనిచేసి పదవి విరమణ పొందిన గోపాలకృష్ణ స్థానంలో తిరిగి వెళ్లడంతో రెంజల్ ఎంపీడీవో స్థానం కాలి ఉండడంతో ఇంచార్జి ఎంపీడీవో గా సూపరిండెంట్ శ్రీనివాసుకు తిరిగి బాధ్యతలను అప్పజెప్పారు. నేటి నుంచి రెంజల్ మండలం ఇంచార్జ్ ఎంపీడీవోగా హెచ్ శ్రీనివాస్ బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సిబ్బంది లక్ష్మ, తోపాటు, గ్రామ కార్యదర్శులు ఆయనకు షాలువ కప్పి ఘనంగా సన్మానం జరిపారు.