రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న తొలి చిత్రం ‘బబుల్‌గమ్’. రవికాంత్ పేరేపు దర్శకుడు. అగ్రహీరో వెంకటేష్ ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘హబీబీ జిలేబీ..’ సాంగ్‌ని లాంచ్ చేయడంతో ఈ చిత్ర మ్యూజికల్ జర్నీ మొదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు వెంకటేష్ శుభాకాంక్షలు తెలియజేశారు.
శ్రీచరణ్ పాకాల మాస్, యూత్‌ని ఆకట్టుకునే పెప్పీ ట్రాక్‌గా కంపోజ్ చేసిన ఈ పాట లీడ్ పెయిర్ డ్యాన్స్ పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్ ఇచ్చింది. రోషన్ కనకాల అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకున్నారు. సింగల్ రాహుల్ సిప్లిగంజ్ తన హై-పిచ్ వోకల్స్‌తో అదనపు ఎనర్జీని నింపారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ ఆకట్టుకున్నాయి. ఈ పెప్పీ ట్రాక్ తెలుగు సినిమా ప్రేమికులకు మ్యూజిక్, విజువల్ ట్రీట్ అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. మనసుని హత్తుకునే జెన్జీ ప్రేమకథతో ప్రేక్షకులను కట్టిపడేసేలా ఈ చిత్రాన్ని రూపొం దించారు. సరికొత్త రొమాంటిక్ జర్నీతో ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టు కోనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న రిలీజ్ కానుంది అని చిత్ర బృందం తెలిపింది.