
నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలోని యాదగిరి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం రామలింగపల్లిలో జరిగిన లాంఛనప్రాయమైన సమర్పణ కార్యక్రమంలో 26 కొత్త ఇళ్ళను అందజేసినట్టు లాభాపేక్షలేని అగ్రగామి గృహనిర్మాణ సంస్థ హాబిటేట్ ఫర్ హ్యుమానిటీ ఈ రోజు ప్రకటించింది. మరియు సెఖ్‌మెట్ ఫార్మావెంచర్స్ కంపెనీకి చెందిన ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ అయిన శ్రీ అనిల్ ఖూబ్‌చందానీ ఉదారమైన సహకారం వల్ల ఈ ప్రాజెక్ట్ సాధ్యమయింది. ఈ వేడుకకు హాబిటేట్ ఫర్ హ్యుమానిటీ నేషనల్ డైరెక్టర్ శ్రీ ఆనంద్ కుమార్ బొలిమెర, సెఖ్‌మెట్ ఫార్మావెంచర్స్ గ్రూప్ అధికారులు, ఇతర జిల్లా అధికారులు, స్థానిక అధికార ప్రతినిధులు హాజరయ్యారు.
బొమ్మలరామారం మండలంలోని ఆప్టిమస్ డ్రగ్స్ ఫ్యాక్టరీకి సమీపంలో ఉన్న 26 కుటుంబాలకు భద్రతతో కూడిన, సురక్షితమైన ఆశ్రయాన్ని ఈ కొత్త ఇళ్ళు అందిస్తాయి. ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి యాజమాన్య కంపెనీ సెఖ్‌మెట్ ఫార్మావెంచర్స్ మరియు అంజన్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి హాబిటేట్ ఫర్ హ్యుమానిటీ ఇండియాతో వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వాములైన చరిత్ర ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో (ఎఫ్‌వై23), ఆప్టిమస్ డ్రగ్స్ సహకారంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 551 ఇళ్ళకు సోలార్ దీపాలను ఏర్పాటు చేసింది, అలాగే ఎఫ్‌వై2023 మరియు ఎఫ్‌వై2024లలో అంజన్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారం అందించిన ఒక ప్రాజెక్ట్ ద్వారా తమిళనాడులో 26 ఇళ్ళకు హాబిటేట్ ఇండియా మరమ్మతులు చేయించింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న హాబిటేట్ ఫర్ హ్యుమానిటీ నేషనల్ డైరెక్టర్ శ్రీ ఆనంద్ కుమార్ బొలిమెర మాట్లాడుతూ “ఇప్పుడు 26 కుటుంబాలకు తమ కొత్త ఇళ్ళలో హుందాతనంతో జీవితాన్ని గడిపే అవకాశం కలిగినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. అందరికీ ఇళ్ళు అనే భారత ప్రభుత్వం విజన్ సాకారానికి హాబిటేట్ ఫర్ హ్యుమానిటీ ఇండియా వారి కృషి దోహదం చేస్తోంది. నివసించడానికి యోగ్యమైన చోటును పొందే అర్హత ప్రతి కుటుంబానికి ఉందనేది మా నమ్మకం, దాతలతో, సమాజంతో మా భాగస్వామ్యం ద్వారా ఆ విజన్‌ను విడతకు ఒక ఇల్లు అనే ఒక వాస్తవంగా మార్చుతున్నాం. మా లక్ష్యానికి ఆప్టిమస్ డ్రగ్స్ ఇస్తున్న మద్దతుకు, వారి చిత్తశుద్ధికి మేం ఎంతో కృతజ్ఞులం” అని చెప్పారు.
ఈ సందర్భంగా సెఖ్‌మెట్ ఫార్మావెంచర్స్ గ్రూప్ సిహెచ్ఆర్ఓ జి.ఉమా రావు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ పి.ఎన్.భాస్కరన్ మాట్లాడుతూ “కార్పొరేట్ సామాజిక బాధ్యత పట్ల మాకున్న అంకితభావాన్ని, మేము పని చేస్తున్న ప్రాంతాల్లోని సమాజాల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో మా చిత్తశుద్ధిని ఈ ప్రాజెక్ట్ ప్రతిబింబిస్తుంది. ఇళ్ళ నిర్మాణంలో హాబిటేట్ ఫర్ హ్యుమానిటీ ఇండియాతో భాగస్వాములం అయినందుకు మేము గర్వపడుతున్నాం. కుటుంబాల మెరుగైన భవిష్యత్తుకు ఈ ఇళ్ళు పునాదులు అవుతాయి, వారు శక్తిని, స్థిరత్వాన్ని, స్వావలంబనను సాధించడానికి దోహదం చేస్తాయి” అని అన్నారు.