
వరి పంటకు నష్టం మండలంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వడగండ్ల వాన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఒక్కసారిగా కురిసిన వడగండ్ల వానతో వరి పంట పాలు పోసుకునే దశ, పొట్ట దశలో ఉండటంతో రైతులకు దిగుబడి తగ్గే అవకాశం ఉన్నందున రైతుల ఆందోళన చెందుతున్నారు. వాతావరణ శాఖ మరో మూడు రోజులు వర్షాలు ఉన్నాయని ప్రకటించడంతో రైతులు వడగండ్ల వానలు కురుస్తాయేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.