పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక

– క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎండతీవ్రతతో పాటు వడగాల్పుల సమస్యా తీవ్రమవుతున్నది. రానున్న నాలుగైదు రోజుల్లో జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, కొమ్రం భీం అసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో వడగాల్పుల వీచే ప్రమాదముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ హెచ్చరికలను జారీ చేసింది. బుధవారం నాడు నల్లగొండ జిల్లా వేములపల్లిలో అత్యధికంగా 44.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది.