ఆదిలాబాద్ అడవుల్లో దర్శనమిచ్చిన హైనా..

Hyena seen in the forests of Adilabad..నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
పులులు, చిరుతులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ఉండే హైనాలు మావల అటవీ ప్రాంతంలో కనిపించడం కలకలం రేపుతోంది. ఈ దృశ్యం సీసీ కెమెరాలో చిక్కడంతో బయటకు వచ్చింది. ఈ అటవీ ప్రాంతంలో పులులు, చిరుతలున్నాయనే భయందోళనలో ప్రజలున్నారు. సరిహద్దున మహారాష్ట్ర, తడోబా అటవీ క్షేత్రం నుంచి పులులు, చిరుతలు జిల్లాలో సంచరిస్తున్నాయి. ఈ క్రమంలోనే వాటి వెంబడే ఇప్పుడు హైనాలు రావడం మంచిపరిణమని చెబుతున్నారు.