హెయిర్ అప్ లేదా హెయిర్ డౌన్..

నవతెలంగాణ – హైదరాబాద్: పర్ఫెక్ట్ హెయిర్ డే అనుభూతిని మరేదీ అధిగమించదు.  ఈ విషయంలో తన అగ్రశ్రేణి హెయిర్ గేమ్‌ను రహస్యాన్ని వివరించేందుకు గ్లోబల్ స్టార్ దీపికా పదుకొణె కన్నా ఉన్నతమైన వారు మరెవరు ఉన్నారు? డైసన్ హెయిర్ కేర్ టెక్నాలజీస్ బ్రాండ్ అంబాసిడర్, దీపికతో నిర్వహించిన కొత్త రాపిడ్-ఫైర్ క్వచ్చన్ అండ్ ఆన్సర్ వీడియో మనకు గతంలో తెలియని ఆమె హెయిర్ స్టైలింగ్ రహస్యాలను వెల్లడిస్తుంది. తన హెయిర్ జర్నీ గురించి పంచుకుంటూ, దీపికా పదుకొణె మాట్లాడుతూ, ‘‘నా జుట్టుతో నా సంబంధం అంటే అది ఆత్మవిశ్వాసం అలాగే ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రయాణం. చక్కని స్టైల్, హెల్తీ హెయిర్ అనేవి పర్సనల్ స్టైల్ స్టేట్‌మెంట్‌ను నిర్వచిస్తాయి. అందుకే, హెయిర్ స్టైలింగ్ ఎల్లప్పుడూ వాటిని రక్షించేందుకు అవసరమైన చర్యలను కలిగి ఉండాలి. పలు ఉత్పత్తులతో శిరోజాల పోషణకు నువ్వు కఠినమైన చర్యలను అనుసరిస్తానా అని నన్ను తరచుగా అడుగుతూ ఉంటారు. నా ప్రతిస్పందన ఎల్లప్పుడూ- సరళంగా ఉంచండి అనే చెబుతాను. హెయిర్‌స్టైలింగ్‌ను సరళంగా, డ్యామేజ్‌ రహితంగా ఉంచేందుకు డైసన్ హెయిర్‌కేర్ రేంజ్ నా సమస్యను లభించిన పరిష్కారం. అంతే కాదు నేను దాన్ని ఉపయోగించడం ప్రారంభించినప్పటి నుంచి, నా జుట్టు సంరక్షణ దినచర్యలో అవి అంతర్భాగంగా ఉన్నాయి. అలాగే, వేడితో, నా శిరోజాలకు నష్టం కలుగుతుందని ఆలోచించే అవసరం లేకుండా తేలికగా నాకు ఇష్టమైన స్టైల్‌ను అనుసరించేందుకు ఉపయోగపడతాయి’’ అని వివరించారు.
ఇది హెయిర్ స్టైల్ రూపాన్ని కలిగిస్తుందా లేదా విచ్ఛిన్నం చేస్తుందా
తయారయ్యేందుకు 15 నిమిషాల సమయం ఇస్తే, ఒకరు ఏది ఇష్టపడతారు – అల్పాహారం తింటారా లేదా జుట్టు సిద్ధం చేసుకుంటారా? దీపిక విషయంలో అయితే రెండూ చేస్తారు! అద్భుతమైన దుస్తులు, చక్కని మేకప్ నిస్సందేహంగా ఎవరి రూపాన్ని అయినా మెరుగుపరుస్తాయి. అయితే సరైన కేశాలంకరణ ఏ రూపానికైనా కీలకమని ఆమె దృఢంగా విశ్వసిస్తారు. దీని గురించి మాట్లాడుతూ, ‘‘మీరు చాలా అద్భుతమైన దుస్తులను ధరించవచ్చు. అంతకన్నా అత్యంత అద్భుతమైన మేకప్ కలిగి ఉండవచ్చని నేను భావిస్తున్నాను. అయితే, మీకు జుట్టు సరిగ్గా అలంకరించుకోకపోతే, అది అక్షరాలా మీ రూపాన్ని మార్చుతుంది లేదా విచ్ఛిన్నం చేస్తుంది’’ అని స్పష్టం చేశారు.
జుట్టును అలా వదిలేయండి
అవును, అందమైన ఓపెన్ హెయిర్ అనేది దీపికా పదుకొణెకి గో-టు హెయిర్‌స్టైల్. ఎందుకంటే ఇది పగలు మరియు సాయంత్రం రెండింటికీ పని చేస్తుంది. మీరు మీటింగ్‌కి హాజరవుతున్నప్పుడు లేదా పనులు చేస్తున్నప్పుడు ఓపెన్ హెయిర్‌స్టైల్‌ మీకు ప్రశంసలను తీసుకువస్తుంది. సాయంత్రం బయటకు వెళ్లవలసినప్పుడు శ్రమరహితంగా డ్రెస్సింగ్ చేసుకోవచ్చు.
హెయిర్ అప్ లేదా హెయిర్ డౌన్?
ఇది కచ్చితంగా కష్టమైన ఎంపిక. కానీ, దీపికా పదుకొనే రెండింటినీ ఇష్టపడతారు. దీని గురించి ఆమె వివరిస్తూ, ‘‘ఇది నిజంగా లుక్‌పై ఆధారపడి ఉంటుంది. నేను ఎలా ఫీల్ అవుతున్నాను అనేది నేను ధరించేదానిపై ఆధారపడి ఉంటుంది’’ అని తెలిపారు. దీన్ని మనం మరింతగా అంగీకరించలేము. డైసన్ ఎయిర్‌వ్రాప్ TM మల్టీ-స్టైలర్ మనకు అందుబాటులో ఉన్నప్పుడు, దాని విభిన్న అటాచ్‌మెంట్‌లు మీ దుస్తులను, మానసిక స్థితి మరియు సందర్భానుసారంగా బహుముఖ కేశాలంకరణను సృష్టించే స్వేచ్ఛను మీకు అందిస్తాయి.
ఇష్టమైన స్టైలింగ్ సాధనం
దీపికా, ఆమె గ్లామ్ టీమ్ ఇద్దరూ డైసన్ హెయిర్ కేర్ రేంజ్‌ని ఇష్టపడతారు. ముఖ్యంగా డైసన్ సూపర్‌సోనిక్ హెయిర్ డ్రైయర్. ‘‘ఇది నా జుట్టును రెండు నిమిషాల్లోనే చాలా వేగంగా తేమ లేకుండా చేస్తుంది. అలాగే ఇది జుట్టుకు ఎటువంటి హాని కలిగించదు’’ అని ఆమె తెలిపారు. డైసన్ హెయిర్ కేర్ రేంజ్ పట్ల తనకున్న ప్రేమను పంచుకుంటూ, “డైసన్ హెయిర్ కేర్ పరిశ్రమలో నిజంగా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ఎయిర్‌వ్రాప్ మల్టీ-స్టైలర్ వంటి ఉత్పత్తులతో హెయిర్ కేర్ టెక్నాలజీలో సాధ్యమయ్యే వాటి సరిహద్దులను ఇన్నోవేషన్ చుట్టూ కేంద్రీకరించిన బ్రాండ్ ఎథోస్‌ను తీసుకువచ్చింది. విపరీతమైన వేడితో జుట్టుకు నష్టం జరుగుతుందని చింతించకుండా ఇంట్లోనే సెలూన్ లాంటి కేశాలంకరణను పొందడం బహుముఖంగా మాత్రమే కాకుండా సౌకర్యవంతంగా ఉంటుంది’’ అని వివరించారు. ఈవెంట్‌కు ముందు ఆమె జుట్టును ఎలా స్టైల్ చేస్తుంది అని అడిగినప్పుడు, దీపిక ఇలా వివరించారు, “నేను హీట్ ప్రొటెక్టెంట్‌తో ప్రారంభించాలనుకుంటున్నాను. సరళమైన, సొగసైన మరియు బ్లో డ్రైయర్‌తో సమర్థవంతంగా పనిచేసే స్టైల్‌ను ఎంచుకోవాలనుకుంటున్నాను. ఇది సొగసైన పోనీ టైల్ అయినా లేదా వదులుగా ఉండే వేవ్స్ అయినా- ఆ గ్లామ్ టచ్‌ను జోడించే పూర్తి మెరుగులు గురించి మాత్రమే. డైసన్ ఫ్లైఅవే అటాచ్‌మెంట్ పూర్తి టచ్‌లకు సరైన మార్గం’’ అని అన్నారు. డైసన్ హెయిర్ కేర్ శ్రేణి, హెయిర్ సైన్స్ మద్దతుతో విపరీతమైన వేడితో కలిగే నష్టానికి తగ్గించేందుకు పరిమిత ఎక్స్‌పోజర్‌తో, ఉన్నతమైన స్టైల్‌లను అందించేలా తయారు చేశారు. డైసన్ సూపర్‌సోనిక్ హెయిర్‌డ్రైయర్, ఉదాహరణకు, వేడితో శిరోజాలు దెబ్బతినకుండా నిరోధించేందుకు ఇంటెలిజెంట్ హీట్ కంట్రోల్‌ను ఉపయోగించుకుంటూ, తన శక్తివంతమైన వాయుప్రవాహం జుట్టును త్వరగా, సమానంగా ఆరిపోయేలా చేస్తుంది.