– ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ 168/2
– హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ 301/10
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆంధ్ర యువ బ్యాటర్ షేక్ రషీద్ (79 నాటౌట్, 161 బంతుల్లో 11 ఫోర్లు) అజేయ అర్థ సెంచరీతో కదం తొక్కాడు. ఏడు ఫోర్లతో 89 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన షేక్ రషీద్ ఆంధ్ర ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు. ఓపెనర్లు హేమంత్ రెడ్డి (9), అభిషేక్ రెడ్డి (38) నిష్క్రమించగా.. క్రీజులో ఓ ఎండ్‌లో నిలబడ్డాడు. కరణ్ షిండె (41 నాటౌట్, 94 బంతుల్లో 4 ఫోర్లు) తోడుగా ఆంధ్రను తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దిశగా నడిపిస్తున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సరికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 58 ఓవర్లలో 2 వికెట్లకు 168 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో మరో 133 పరుగుల వెనుకంజలో కొనసాగుతుంది. అంతకుముందు, ఓపెనర్ తన్మరు అగర్వాల్ (159, 287 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) వన్‌మ్యాన్‌షోతో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 105.4 ఓవర్లలో 301 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్ త్రిపురణ విజరు (5/118) ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. హనుమ విహారి, శ్రీకర్ భరత్ బ్యాటింగ్ రావాల్సి ఉండటంతో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ మంచి ఆధిక్యంపై కన్నేసింది.