
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నాగార్జునసాగర్ నియోజకవర్గ క్రైస్తవ సోదర, సోదరీమణులకు మంగళవారం హాలియా మార్కెట్ ఛైర్మెన్ తుమ్మల పల్లి చంద్ర శేఖర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ అంటే ఏసు ప్రభువును జ్ఞాపకం చేసుకునే సమయం. విశ్వవ్యాప్తంగా ప్రజలందరిలో ప్రేమ,సహనం, కరుణ,దయ మరియు పూర్వక అనుబంధాలను మేలుకొలుపుతూ ఏసు బోధనలను ఆదరించే సందర్భం. ధర్మం మరియు విశ్వాసపూరితమైన గమనానికి ఏసుక్రీస్తు జీవనం మనందరికీ ప్రేరణనిస్తుంది. ఈ సందర్భంగా క్రైస్తవ సోదర,సోదరీమణులలో శాంతి, సామరస్యం విరజిల్లాలని ప్రార్థిస్తున్నాను. క్రైస్తవులంతా భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని క్రైస్తవ సోదర,సోదరీమణులను ఆకాంక్షిస్తున్నాను అని చైర్మన్ చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు.