లండన్ : ఐస్‌ల్యాండ్ అధ్యక్ష ఎన్నికల్లో హల్లా తోమస్‌దత్తిర్ విజయం సాధించారు. ఈ నెల 1న ఈ ఎన్నికలు నిర్వహించారు. ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో వ్యాపారవేత్త, పెట్టుబడిదారు అయిన హల్లా తోమస్‌దత్తిర్ 34.3 శాతం ఓట్లతో ఎన్నికయ్యారు. మాజీ ప్రధానమంత్రి కత్రిన్ జకోబస్దోత్తిర్‌కు 25.2 శాతం, హల్లా హ్రుండ్ లగోడోత్తిర్‌కు 15.5 శాతం ఓట్లు లభించాయి. వీరు ముగ్గురూ మహిళలే. హల్లా తోమస్‌దత్తిర్ ప్రస్తుత అధ్యక్షులు గుడ్ని థ్ జోహన్సెసన్ స్థానంలో బాథ్యతలు స్వీకరించను న్నారు. ఆగస్టు 1న ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఐస్‌ల్యాండ్‌్ ప్రస్తుతం అనేక యూరప్ దేశాల మాదిరిగానే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారవేత్త అయిన హల్లా తోమస్‌దత్తిర్ అధ్యక్షురాలిగా ఎన్నికకావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.