– సర్పంచ్ సంతకం ఫోర్జరీ చేసిన కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్
– 650 మంది లబ్దిదారుల్లో 72 మందికే పాసు పుస్తకాలు
– రూ.రెండు వేల నుంచి మూడు వేలు వసూలు
నవతెలంగాణ-పెద్దవూర
నల్లగొండ జిల్లాలో పోడు భూములు సాగు చేస్తున్న వారికి హక్కు పత్రాల జారీకి సంబం ధించిన సర్వేల్లో కొంతమంది అధికారులు చేతి వాటం ప్రదర్శి స్తున్నారు. గతేడాది నవంబర్‌లో పోడు భూముల సాగుదారుల నుంచి అర్జీలను స్వీకరించిన అధికా రులు క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించారు. అక్రమాలకు తావు లేకుండా సాంకే తికతను వినియో గిస్తూ భూముల కొలతలు తీసుకుంటూ అర్జీదారుల ఫొటోలను చిత్రీకరించారు. ఇప్పుడు పట్టాదారు పాసుపుస్త కాలు జారీ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఒకరిద్దరు అధి కారులు లబ్దిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది. తిరుమలగిరి సాగర్ మండలం నాగా ర్జునపేటలో పోడుభూముల సర్వేలో ఆ గ్రామ కార్యదర్శి ఒక్కొక్కరి నుంచి భూమి ని బట్టి రూ.2వేల నుంచి 3 వేలు.. 72 మంది నుంచి లక్ష రూపాయలకుపైగా తీసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గ్రామంలో 650 మంది దరఖాస్తు చేసుకోగా.. 72 మందికి పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేశారని గ్రామస్తులు తెలిపారు.సర్పంచ్ లేకుండానే సర్పంచ్ ఉన్నట్టు గ్రామసభ తీర్మానం చేసి సర్పంచ్ సంత కాన్ని ఫోర్జరీ చేశారు. కార్యదర్శితో ఫీల్డ్ అసిస్టెంట్ కుమ్మక్కై ఇష్టం వచ్చినట్టు డబ్బులు దండుకుంటూ సమీప బంధువులకు మాత్రమే పట్టాలు ఇప్పించా రంటూ గ్రామస్తులు ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి అసలైన లబ్దిదారులకు పాస్ పుస్త కాలు ఇప్పించాలని, లేకుంటే ఆందోళన చేస్తామని, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని పలువురు గ్రామస్తులు తెలిపారు.
సర్వే చేసి పాసు పుస్తకాలు ఇవ్వలేదు
మాకు మూడెకరాల భూమి వుంది. అధికారులు సర్వే చేశారు. కార్యదర్శికి భూమికి సంబంధిం చిన కాగితాలు, జీరాక్స్‌లు ఇచ్చాం. మీకు రాస్తాం.. వెళ్లిపొమ్మని చెప్పారు. కానీ, డబ్బులు ఇచ్చిన వారికే రాసి పంపారు. మేము డబ్బులు ఇవ్వలేదు. మాకు పాసు పుస్తకం రాలేదు.
– అంగోతు సాలి(నాగార్జునపేట)
40 ఏండ్లుగా కబ్జాలో ఉంటున్నాం
మానాన్న, మా తాతలు 40 ఏండ్ల నుంచి కబ్జాలో ఉన్నారు. మాకు పాసు పుస్తకం రాలేదు. 600 మందికి పైగా లబ్దిదారు లను ఎంపిక చేస్తే 72 మందికే పాస్ బుక్కులు ఇచ్చారు. సర్పంచ్ సంతకం ఫోర్జరీ చేసి కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్ వారి దగ్గరి బంధు వులకు, డబ్బులు ఇచ్చిన వారికి పుస్తకాలు ఇచ్చారు. మేమంతా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం.
– నేనావత్ శంకర్ (నాగార్జునపేట)