
ఏర్గట్ల మండలకేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ రథానికి,ఏర్గట్ల గ్రామానికి చెందిన కమ్మరి రాజారపు నర్సయ్య తన స్వంత ఖర్చులతో (2 లక్షల 35 వేల రూపాయలతో)నూతన చక్రాలను చేయించి, గ్రామాభివృద్ధి కమిటీకి విరాళంగా అందజేయడంతో, చక్రాలను రథానికి బిగించారు.ఇందుకుగాను ఏర్గట్ల గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు నర్సయ్యకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు కారుపాకల నర్సయ్య,కోశాధికారి సోమ లింగారెడ్డి,గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.