హ్యాండ్ పంప్ పనుల్లో కాంట్రాక్టర్ల ఇష్ట రాజ్యం

నవతెలంగాణ -తాడ్వాయి 

మేడారం సమ్మక్క సారలమ్మల మహా జాతరకు వచ్చు భక్తులకు తాగునీటి అందించే చేతిపంపుల మరమ్మతులు(బోర్లను) శుభ్రపరచడంలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గత 2022లో జాతర మూతలు పెట్టాల్సిన అధికారులు కొన్నింటిని పెట్టకుండానే వదిలేశారు. అనంతరం వాటిని వినియోగం తీసుకురావడానికి శుభ్రం చేయడం కష్టతరంగ మారింది. హ్యాండ్ పంపు లోపల ఉండే చెత్తాచెదారం, మురికి నీటిని తొలగించకుండా, క్రషింగ్ చేయకుండానే మళ్లీ రీ ఫిటింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ శుభ్రం చేసే టైంలో జియా లిస్టులు పర్యవేక్షణ చేపట్టాల్సి ఉండగా వారు ఎక్కడ కనబడిన దాఖలాలు లేవు.  క్లోరినేషన్ బావులలో బోరు బావులలో కూడా వేయాల్సిన వారు, కానీ అట్లాంటిది చేయకుండా కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తులంతో భక్తులు ఈ నీటిని తాగి అస్వస్థతకు గురైయ్యే  అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులు వీటిపై దృష్టి సారించి భక్తులకు మంచినీటి అందించాలని భక్తులు కోరుతున్నారు.