ఓడేడులో చేతి పంపుకు మరమ్మతులు

నవతెలంగాణ – ముత్తారం

ముత్తారం మండలంలోని ఓడేడు గ్రామంలోని 5వ వార్డులో చేతిపంపు చెడిపోయి నీళ్లు రాకపోవడoతో ఆ వార్డు ప్రజల ఇబ్బందులను గమనించిన కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు దాసరి చంద్రమౌళి గౌడ్ స్పందించి, వెంటనే తన సొంత ఖర్చులతో ఆదివారం మరమ్మతులు చేయించి నీటి ఇబ్బందులను తీర్చారు. దీంతో ఆయనను వార్డు సభ్యులు అభినందనలు తెలిపారు. ఆయన వెంట ఎండి.రజాక్, జిల్లెల సంపత్, రాకేష్, ఓదెలు ఉన్నారు.