ఢిల్లీ బాట‌లో…హ‌స్తం నేత‌లు

– టికెట్‌ కోసం ఆశావహుల కుస్తీ
– గాడ్‌ ఫాదర్‌ ఆశీస్సుల కోసం పాట్లు
– నేతల తలరాతలు బేరీజు వేసిన పరిశీలకులు
– చక్రం తిప్పనున్న ఉత్తమ్‌
– చివరి వారంలో మొదటి జాబితా
తెలంగాణలో షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం నడుస్తుండడంతో కాంగ్రెస్‌ పారీ అభ్యర్థుల ఖరారు పై దష్టి సారించింది. దేశ రాజాదాని ఢిల్లీలో సీఈసీ సమావేశం నిర్వహించి నియోజకవర్గంలో టికెట్‌ ఆశించిన అభ్యర్థుల జాబితాను షార్ట్‌అవుట్‌ చేసి అందించనున్నారు. ఆ జాబితాను ఏఐసీసీ క్షుణ్ణంగా పరిశీలించి అన్ని విషయాలను పరిగణనలో ఉంచుకొని ఒక్క పేరుతో జాబితా సిద్ధం చేసి ఈ నెల చివరి వారంలో విడుదల చేస్తారని ప్రచారం సాగుతోంది. మొదటి జాబితాలో 30 మంది పేర్లను ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. దీంతో ఆశావహులు తమ అదష్టాన్ని చివరిసారిగా పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో అభ్యర్థులు ఖరారు కానుండడంతో తమ గాడ్‌ ఫాదర్‌ ద్వారా టికెట్‌ దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఢిల్లీ బాట పట్టారు.
నవతెలంగాణ-మిర్యాలగూడ
తెలంగాణలో షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం నడుస్తుండడంతో కాంగ్రెస్‌ పారీ అభ్యర్థుల ఖరారు పై దష్టి సారించింది. దేశ రాజాదాని ఢిల్లీలో సీఈసీ సమావేశం నిర్వహించి నియోజకవర్గంలో టికెట్‌ ఆశించిన అభ్యర్థుల జాబితాను షార్ట్‌అవుట్‌ చేసి అందించనున్నారు. ఆ జాబితాను ఏఐసీసీ క్షుణ్ణంగా పరిశీలించి అన్ని విషయాలను పరిగణనలో ఉంచుకొని ఒక్క పేరుతో జాబితా సిద్ధం చేసి ఈ నెల చివరి వారంలో విడుదల చేస్తారని ప్రచారం సాగుతోంది. మొదటి జాబితాలో 30 మంది పేర్లను ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. దీంతో ఆశావహులు తమ అదష్టాన్ని చివరిసారిగా పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో అభ్యర్థులు ఖరారు కానుండడంతో తమ గాడ్‌ ఫాదర్‌ ద్వారా టికెట్‌ దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సభ్యులుగా ఉండడంతో అతని ద్వారా టికెట్‌ పొందాలని ఆశవాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నేతలు అతనిపై తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలో టికెట్‌ ఖరారు పై సమావేశం జరుగుతుండడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నేతలు ఆశావాహులు ఇప్పటికే ఢిల్లీ బాట పట్టారు. అక్కడే మకాం వేసి ఢిల్లీ పెద్దల ఆశీస్సుల కోసం పావులు కదుపుతున్నారు.
ఇంటింటికి కాంగ్రెస్‌
విజయభేరి సభ విజయవంత కావడంతో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలతో పార్టీ నేతలు ఇంటింటి కాంగ్రెస్‌ కార్యక్రమం చేపట్టారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఆరు గ్యారెంటీ కార్డులు గురించి ప్రతి ఒకరికి వివరిస్తూ చైతన్య పరుస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలలో నేతలు క్షేత్రస్థాయిలో ప్రచారం మొదలుపెట్టారు. గ్యారంటీ కార్డు పథకాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. తుక్కుగూడ సభ సక్సెస్‌ కావడంతో క్షేత్రస్థాయిలో క్యాడర్లో ఉత్సాహం నింపుకుంది.పైరవీ ద్వారా టికెట్లు ఇవ్వబోమని సర్వేల ఆధారంగానే గెలుపు గుర్రాలకు టికెట్‌ ఇస్తామని గతంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రకటించడంతో సర్వేలతోపాటు ఢిల్లీ నాయకుల మద్దతు కూడగట్టేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
పూర్తయిన పరిశీలకుల పర్యటన
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, ఆశావహుల బలబాలాలను పరిశీలించేందుకు వచ్చిన అగ్రనేతుల పర్యటన పూర్తయింది. ఈనెల 17, 18 తేదీలలో పరిశీలకులు ఆయా నియోజకవర్గాల ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం జరిపి పార్టీ గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహాలు పై చర్చించారు. సిడబ్ల్యుసి సభ్యులైన మాజీ మంత్రి రఘువీరారెడ్డి సూర్యాపేటకు, లాల్జీ దేశారు నల్గొండకు విశ్వనాథ్‌ భువనగిరి నియోజకవర్గం పార్టీ పరిశీలకులుగా హాజరై పార్టీ పరిస్థితి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి సమగ్ర నివేదిక సమర్పించి మంగళవారం రాత్రి వెళ్లిపోయారు. ఆ నివేదిక కూడా అభ్యర్థుల ఎంపికలో కీలకపాత్ర పోషిస్తుందని పార్టీ నాయకులు అభిప్రాయ పడుతున్నారు.
ఈనెల చివరిలో మొదటి జాబితా విడుదల
రానున్న అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సీఈసీ సభ్యులు ఉత్తంకుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తో పాటు మిగతా ముఖ్య నాయకులతో బుధవారం ఢిల్లీలో సమావేశం అయినట్లు సమాచారం. గతంలో పంపించిన అభ్యర్థుల జాబితాను సర్వేల ఆధారంగా పూనం పరిశీలించి నాలుగు పేర్లతో కూడిన జాబితను ఏఐసీసీకి అందించినట్లు సమాచారం. ఇందులో అభ్యర్థుల బలబలాలు, పార్టీ పరిస్థితి, ఒక పార్లమెంటులో రెండు బీసీ సీట్లు కేటాయింపులను పరిగణలోకి ఉంచుకొని అన్ని జాగ్రత్తలు తీసుకొని అభ్యర్థుల పేరును ఖరారు చేయనున్నారు ఈనెల చివరన 30 మందితో తొలి జాబితా విడుదల కానున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. తొలి జాబితాలో నల్గొండ, హుజూర్‌నగర్‌, కోదాడ, నాగార్జునసాగర్‌, సూర్యాపేట, దేవరకొండ నియోజవర్గాలలో పోటీ చేసే అభ్యర్థులు పేర్లు ప్రకటించనున్నట్లు సమాచారం.
వామపక్షాలకు మిర్యాలగూడ, మునుగోడు…
బీజేపీిని ఓడించడం లక్ష్యంగా ఉన్నా వామపక్షాలు ఇండియా కూటమిలో భాగస్వామ్యులుగా ఉన్నాయి. అందులో భాగంగానే త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వామ పక్షాలతో కలిసి పోవాలని కాంగ్రెస్‌ అగ్ర నేతలు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇదే పద్యంలో ఇప్పటికే సిడబ్ల్యూసి సభ్యులు కేసి వేణుగోపాల్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్జి మాణిక్‌ ఠాక్రే వామపక్ష నేతలతో సంప్రదింపులు జరిపి పొత్తుపై క్లారిటీ వచ్చినట్లు సమాచారం.సీపీఐ(ఎం), సీపీఐకి చెరో రెండు అసెంబ్లీ స్థానాలతో పాటు చెరో ఒక ఎమ్మెల్సీ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సుముఖంగా ఉన్నట్లు సమాచారం అదే జరిగితే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సీపీఐ(ఎం)కు మిర్యాలగూడ, సీపీఐ కు మునుగోడు నియోజవర్గాలు కేటా యించే అవకాశం కల్పిస్తుంది. దీనిపై దాదాపు ఖరారు అయినట్లు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగు తుంది. కానీ పొత్తుపై ఈ రెండు పార్టీలు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.