– కేఎస్‌జీ జేపీఎల్ విజేత టీవీ9
నవతెలంగాణ-హైదరాబాద్: వారం రోజులుగా ఉత్సాహంగా జరుగుతున్న కేఎస్‌జీ జర్నలిస్టు టీ20 ప్రీమియర్ లీగ్ (జేపీఎల్) శనివారం ముగిసింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఎన్టీవీపై టీవీ9 12 పరుగుల తేడాతో నెగ్గి, జేపీఎల్ సీజన్-1 చాంపియన్‌గా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ద టోర్నీ అవార్డు ఎన్టీవీ ప్లేయర్ కిరణ్‌కు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు టీవీ9 ప్లేయర్ జగదీష్‌కు లభించింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు, ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్, సహాయ కార్యదర్శి బసవరాజు, కౌన్సిలర్ సునిల్ అగర్వాల్ కలిసి విజేత, రన్నరప్ జట్లకు ట్రోఫీలు, క్రికెటర్లకు పతకాలు ప్రదానం చేశారు. మ్యాచ్ అనంతరం స్పోర్ట్స్ జర్నలిస్టుల అసోసియేషన్ తెలంగాణ (ఎస్‌జాట్) తరఫున పది మంది దివ్యాంగ క్రీడాకారులకు నగదు ప్రోత్సాహక చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో త్రుక్ష ఫుడ్స్ ఎండీ భరత్ రెడ్డి, కేఎస్‌జీ సీఈఓ సంజయ్, లైఫ్‌స్పాన్ స్పోర్ట్స్ హెడ్ భరణి, స్మయిల్‌గార్డ్ ఫౌండర్ శరత్, జూపర్ ఎల్‌ఈడీ సీఈఓ ఒరుసు రమేష్, మెడికవర్ తెలంగాణ హెడ్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
సంక్షిప్త స్కోర్లు:
టీవీ9- 20 ఓవర్లు – 141/7
బ్యాటింగ్: ఓపెనర్ సాయికిశోర్ – 25 బంతుల్లో 36 రన్స్
ఆల్‌రౌండర్ సత్య – 33 బంతుల్లో 45 రన్స్
బౌలింగ్: అశోక్ చౌదరి (2/19)
కిరణ్ (2/22)
………..
ఎన్టీవీ – 20 ఓవర్లు – 129/8
బ్యాటింగ్: ప్రేమ్‌చంద్ – 22 బంతుల్లో 18 రన్స్ (రిటైర్డ్ హర్ట్)
కిరణ్ – 32 బంతుల్లో 16 రన్స్
బౌలింగ్: రాము (2/13)
జగదీష్ (2/15)