
చేనేత సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం చండూరు జెడ్పీటీసీ కర్ణాటి వెంకటేశం చేనేత కమిషనర్ అలుగు వర్షిని మర్యాదపూర్వక కలిసి చేనేత కార్మికులు ఎదుర్కొన్న సమస్యల పైన, సహకార సంఘాల, ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన బకాయిలు వెంటనే చెల్లించాలని, వివరించి ఆమె దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. గట్టుప్పల్ లో క్లస్టర్ మగ్గాలు 200 ఇచ్చామని, మిగతా వారికి ఆర్డర్ ఇచ్చి అందరికీ అందేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డం జగన్నాధం మాజీ ఆప్కో చైర్మన్,కందగట్ల స్వామి,కవర్తపు మురళి,కూరపాటి రమేష్, తదితరులు పాల్గొన్నారు.