చేనేత పథకాలు కొనసాగించాలి 

Handloom schemes should be continuedనవతెలంగాణ – చండూరు  
గత ప్రభుత్వాలు మాదిరిగానే  ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం  చేనేత పథకాలు కొనసాగించాలని  మాజీ ఆప్కో డైరెక్టర్ , మాజీ జెడ్పిటిసి కర్ణాటి వెంకటేశం అన్నారు. బుధవారం గట్టుపల  మండల కేంద్రంలో   చేనేత జాతీయ  ఉత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు   11 నెలలుగా త్రిఫ్ట్ పండ్ నిధులు రావడం లేదని, 8 నెలలుగా ఆగిన చేనేత మిత్ర నిధులను వెంటనే విడుదల చేయాలని  డిమాండ్ చేశారు. నిలువ ఉన్న వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలకు ప్రభుత్వం చేనేత  చీరెలను పంపిణీ చేయాలని  కోరారు. రైతు రుణమాఫీ మాదిరిగానే చేనేత రుణమాఫీని చేపట్టాలని  ప్రభుత్వ పూచికత్తు పైన కార్మికులకు రూ. 2లక్షల చొప్పున రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రింటెడ్ చీరలను వెంటనే ప్రభుత్వ అరికట్టాలని డిమాండ్ చేశారు. వయసుతో సంబంధం లేకుండా చేనేత బీమాను అమలు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత రంగానికి రూ.2000 కోట్లు కేటాయించాలన్నారు. 50 సంవత్సరాలు పైబడిన వారికి  పెన్షన్లు, చేనేతలకు ఇల్లు కట్టుకోవడానికి నిధులు ఏర్పాటు చేయాలన్నారు.  యువజన సంఘం అధ్యక్షుడు పున్న కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన   ఈ కార్యక్రమంలో  పద్మశాలి యువ జన సంఘం గౌరవ అధ్యక్షులు చెరిపల్లి కృష్ణ ,ఉపాధ్యక్షుడు  కర్నాటి వెంకటేశం ,చిలుకూరి నరేందర్ ,చేనేత కార్మికు సంగం అధ్యక్షులు  అందే రాము,పున్న ఆనంద్ ,  రమేష్ ,కుకూడలా స్వామి , పులిపాటి మల్లేష్ , గంజి సురేష్ కర్నాటి లింగయ్య, చేపూరి ధనంజయ్య, తదితరులు పాల్గొన్నారు.