ప్రమాదవశాత్తు వ్యవసాయ క్షేత్ర బావిలో పడిన కొండగొర్రె ను అధికారులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ తన వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్న బావిలో పడిపోయిన కొండ గొర్రె ను గమనించాడు. బావిలోకి తాడు సహాయంతో దిగి కొండ గొర్రెను రక్షించి ఇంటికి తీసుకెళ్లాడు. కొండ గొర్రె విషయం అటవి అధికారులకు సమాచారం అందించడం జరిగింది. ఆటవి అధికారులు డీఆర్వో దేవిదాస్, బీట్ అధికారులు రమేష్, విజయ్ లు బడా భీంగల్ వెళ్లి కొండ గొర్రెను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కొండ గొర్రెను అడవిలో వదిలివెస్తామని ఆటవి అధికారులు తెలిపారు.