బాధితునికి మొబైల్ ఫోన్ అప్పగింత..

నవతెలంగాణ – శాయంపేట
మొబైల్ ఫోన్ పోగొట్టుకోగా ఐటీ కోర్ సహాయంతో మొబైల్ ను ట్రేస్ చేసుకుని పట్టుకొని బాధితుడికి అప్పగించినట్లు ఎస్సై ప్రమోద్ కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం..మండలంలోని ప్రగతిసింగారం గ్రామానికి చెందిన బోయిని పైడి తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. ఇదే విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ – కాప్స్ రైటర్ కె. రతీష్ సహకారంతో సిఇఐఆర్ లో మొబైల్ వివరాలు పొందుపరుస్తూ దరఖాస్తు చేయగా, ఐటీ కోర్ సహాయంతో ఎస్సై ప్రమోద్ కుమార్ మొబైల్ని ట్రేస్ చేసి పట్టుకొని శుక్రవారం బాధితుడు పైడికి మొబైల్ ఫోన్ అప్పగించినట్లు  తెలిపారు. ఈ సందర్భంగా పైడి ఎస్సై ప్రమోద్ కుమార్ కు, పోలీస్ శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.