– చిన్నారి ప్రాణం తీసిన చీర ఊయల
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
చీరతో కట్టిన ఊయల చిన్నారి ప్రాణం తీసింది. అది మెడకు బిగుసుకుపోయి బాలిక మృతి చెందింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల పరిధిలోని ఉంద్యాల గ్రామంలో బుధవారం జరిగింది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఫర్టిలైజర్ షాప్‌లో గొల్ల కురుమన్న, శైలజ దంపతులు పని చేస్తున్నారు. వారి కుమార్తె(10) అనూషిత ఉదయం ఇంటిముందున్న సబ్జారింగుకు చీరతో ఊయల కట్టి ఊగుతోంది. ఈ క్రమంలో చీర బాలిక గొంతుకు బిగుసుకుపోయి మృతిచెందింది. కొంత సమయం తర్వాత తల్లి బయటికి వచ్చి చూడగా పాప వేలాడుతూ కనిపించింది. వెంటనే ఊయల నుంచి బయటకు తీసి ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పాప చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.