నసురుల్లాబాద్ పిఆర్టియు అధ్యక్షుడిగా హన్మాండ్లు 

Hanmandlu as President of Nasurullahabad PRTUనవతెలంగాణ – నసురుల్లాబాద్ 
మండల పరిధి పిఆర్టియు సర్వసభ్య సమావేశం జరిగింది. శుక్రవారం నసురుల్లాబాద్  మండల కేంద్రంలో పిఆర్టియు సభ్యులతో సమావేశం నిర్వహించారు.ఇందులో మండల పిఆర్టియు కార్యవర్గం ఎన్నిక నిర్వహించాలని తీర్మానం చేశారు. ఈ ఎన్నికకు ఎన్నికల పరిశీలికులుగా జిల్లా పిఆర్టియు అధ్యక్షులు దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కుశాల్ అధ్వర్యంలో లో నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. ఈ నూతన కార్యవర్గంలో  గౌరవ అధ్యక్షుదుగా, గునిగెరి హన్మాండ్లు, కార్యదర్శిగా, చందర్, అసోసియేట్     అధ్యక్షుదుగా  సంజీవులు, ఉపాధ్యక్షురాలుగా సుజాత, కార్యదర్శిగా శ్రీనివాస్ గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. నూతన కార్యవర్గ అధ్యక్షులను సభ్యులను పిఆర్టియు సభ్యులు జిల్లా కమిటీ అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో సుపరిచితుడైన హన్మాండ్లు గత మూడు సార్లు మండల పిఆర్టియు మండల ప్రెసిడెంట్ కావడం ఎన్నిక కావడంతో మిత్రులు శ్రేయోభిలాషులు పి ఆర్ టి యు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నిక కాబడిన పిఆర్టియు మండల ప్రెసిడెంట్ గునిగేరి హనుమాన్లు మాట్లాడుతూ టిఆర్టియూ సంఘం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో మరోసారి మండల ప్రెసిడెంట్ గా అవకాశం ఇచ్చిన మండల పిఆర్టియు సభ్యులందరికీ జిల్లా నాయకత్వానికి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.