డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబోలో రూపొందిన చిత్రం ‘హను-మాన్’. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.మేకర్స్ ఇప్పటివరకు మూడు పాటలను విడుదల చేసారు. అవన్నీ చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. జోనర్, కంపోజిషన్ పరంగా దేనికవే ప్రత్యేకమైన పాటలుగా అలరించాయి. తాజాగా మంగళవారం మేకర్స్ 4వ సింగిల్‌గా ‘శ్రీరామధూత స్త్రోత్రం..’ విడుదల చేశారు. శ్రీ ఆంజనేయ స్తోత్రం థండర్స్‌తో కూడిన బీట్స్‌కి అనుగుణంగా గౌరహరి అద్భుతంగా కంపోజ్ చేశారు. సాయి చరణ్ భాస్కరుణి, లోకేశ్వర్ ఎడర, హర్షవర్ధన్ చావలి ఎనర్జిటిక్ వాయిస్ పాట థీమ్‌తో ఇంటెన్స్‌ని జోడిస్తుంది. ఈ లిరికల్ వీడియో 3డీ ప్రజంటేషన్ చాలా అమెజింగ్‌గా ఉంది. విజువల్స్‌తో చూసినప్పుడు ఇది గూస్‌బంప్‌లను కలిగించనుంది. మొదటి మూడు పాటల్లాగే శ్రీరామదూత స్త్రోత్రం కూడా అందరి మనసులను గెలుచుకోబోతోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. తేజ సజ్జ సరసన అమత అయ్యర్ కథానాయికగా నటించగా, వరలక్ష్మి శరత్‌కుమార్, వినరు రారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అంజనాద్రి అనే ఇమాజనరీ ప్లేస్‌లో సెట్ చేసిన ఈ సినిమా కాన్సెప్ట్ యూనివర్సల్‌గా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించే అవకాశం ఉందనే దీమాని నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈనెల 12న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి డీవోపీ: దాశరధి శివేంద్ర, ఎడిటర్: సాయిబాబు తలారి.