జర్నలిస్టు కాలనీలో హనుమాన్ చాలీసా కార్యక్రమం

నవతెలంగాణ- ఆర్మూర్
పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ లోని భక్త హనుమాన్ ఆలయంలో కాలనీవాసులు మంగళవారం రాత్రి హనుమాన్ చాలీసా పారాయణము నిర్వహించారు. భక్తులు సామూహికంగా నిలబడి హనుమాన్ చాలీసా పారాయణము చేసి, తర్వాత మంగళ హారతి ఇచ్చారు. జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్, ఆలయ కమిటీ కోశాధికారి ఎర్ర భూమయ్య, కాలనీ పెద్దలు గడ్డం శంకర్, సంఘం నర్సయ్య, నరహరి, గణపతి, సాయన్న, జీవన్, నారాయణ, గోపి, గణేశ్, బాజన్న తదితరులు పాల్గొన్నారు.