ఘనంగా హనుమాన్‌ విగ్రహ ప్రతిష్ట

Hanuman statue is magnificent– మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా ప్రతిష్ట మహౌత్సవం
– సహకరించిన వారందరికి అభినందనలు తెలిపిన రాష్ట్ర నాయకులు
నవతెలంగాణ-తూప్రాన్‌ రూరల్‌/మనోహరాబాద్‌
మండలంలోని కోనాయిపల్లి పిటి గ్రామంలో హనుమాన్‌ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు భాషాపైన చంద్రశేఖర్‌ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో హనుమాన్‌ విగ్రహ ప్రతిష్ట మహౌ త్సవ కార్యక్ర మాన్ని నిర్వహించారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు వేద పండితులు హనుమాన్‌ విగ్రహ ప్రతిష్టతో పాటు శివలింగం నంది విగ్రహాలను కూడా నూతనంగా ఏర్పాటు చేశారు అలాగే ఆలయం ముందు ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు భాష బోయిన చంద్రశేఖర్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ గత మూడు రోజులుగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజలు, యువకులకు ఆయన అభినందనలు తెలిపారు. అందరం కలిసికట్టుగా ఉండి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివద్ధి చేసుకుందామని కోరారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా గ్రామ ప్రజలు హాజరై అన్న తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. విగ్రహ ప్రతిష్ట మహౌత్సవానికి ఉమ్మడి మండలాల పిఎసిఎస్‌ చైర్మన్‌ మెట్టు బాలకష్ణారెడ్డి. రాష్ట్ర సర్పంచ్ల ఫోరం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చిట్కుల్‌ మైపాల్‌ రెడ్డి. తూప్రాన్‌ మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షులు, మండల పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కావేరి గారి భగవాన్‌ రెడ్డి. నాయకులు ఎంజాల ప్రభాకర్‌ రెడ్డి. రంగయ్యపల్లి సర్పంచ్‌ నాగభూషణంలతోపాటు అధిక సంఖ్యలో నాయకులు ప్రజలు హాజరై పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్‌ మన్నే ధర్మేందర్‌. నరేష్‌. గణేష్‌లు పాల్గొన్నారు.