హను-మాన్‌ సూపర్‌ హిట్‌ ఖాయం : చిరంజీవి

హను-మాన్‌ సూపర్‌ హిట్‌ ఖాయం : చిరంజీవిదర్శకుడు ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘హను-మాన్‌’. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్‌ రెడ్డి నిర్మించారు. శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈనెల 12న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం మెగా ప్రీ రిలీజ్‌ ఉత్సవ్‌ని నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి మాట్లాడుతూ,’ఈ వేడుకకు నేను రావడానికి దోహద పడినవి నాలుగు కారణాలు. హనుమాన్‌ నా ఆరాధ్య దైవం, మా ఇలవేల్పు. ఆ స్వామి గురించి తెలిపే కథ ఈ సినిమా. డైపర్లు వేసుకునే స్థాయి నుంచి డయాస్‌లు ఎక్కే స్టేజ్‌కి అంచలంచెలుగా ఎదుగుతున్న తేజ సజ్జ ఒక కారణం. ఈ చిత్ర ట్రైలర్‌, టీజర్‌లో చాలా అద్భుతమైన ఫైన్‌నెస్‌ కనిపించింది. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ గురించి తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇది గొప్ప సినిమా అవుతుందని అనిపించింది. నిర్మాత నిరంజన్‌ రెడ్డికి హదయపూర్వక అభినందనలు. ఈ వేదిక నుంచి ఒక మంచి ప్రకటన నేను చేస్తే బావుటుందని దర్శక నిర్మాతలు చెప్పారు. అయోధ్య రామమందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. ఈ సమయంలో ఈ చిత్రం రావడం ఒక శుభపరిణామం. హను మాన్‌ చిత్రం ఆడినన్ని రోజులు వచ్చే కలెక్షన్స్‌లో ప్రతి టికెట్‌ పై రూ.5 అయోధ్య రామమందిరానికి ఇవ్వాలని హనుమాన్‌ చిత్ర బందం నిర్ణయం తీసుకుంది. ఇది చాలా గొప్ప నిర్ణయం’ అని తెలిపారు. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ, హీరో తేజ సజ్జా, హీరోయిన్‌ అమత అయ్యర్‌, నిర్మాత కె నిరంజన్‌ రెడ్డి, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, డైరెక్టర్‌ కేవీ అనుదీప్‌, బివిఎస్‌ రవి తదితరులు ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.