కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు: హనుమండ్ల ఝాన్సీ రెడ్డి

నవతెలంగాణ – పెద్దవంగర
గ్రామీణ ప్రాంతాల్లోని కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని రెడ్డికుంట తండాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు బానోత్ శంకర్, బానోత్ బుచ్చి రాములు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుకుని, వారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం లో కార్యకర్తల కృషి ఎనలేనిదన్నారు. పార్టీ కోసం అహర్నిశలు గా పని చేసే కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని చెప్పారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఇన్చార్జి విజయ్ పాల్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు రంగ మురళి గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, రెడ్డికుంట తండా మాజీ సర్పంచ్ బానోత్ జగ్గా నాయక్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, ధారవత్ శంకర్ నాయక్, బానోత్ గోపాల్, వీరా రెడ్డి, బిక్షం, యాకూబ్, వెంకన్న, రాజారాం, గవాస్కర్, నరేందర్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.