
భిక్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన పట్లూరి హనుమంత్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నియామక పత్రాన్ని అందజేశారు. అంతకుముందు చైర్మన్‌గా పనిచేసిన భగవంతు రెడ్డి మరణించడంతో వైస్ చైర్మన్ గా విధులు నిర్వహించిన హనుమంత్ రెడ్డిని చైర్మెన్‌గా, వైస్ చైర్మన్ గా పురం రాజమౌళిని నియమించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించడంలో నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాల్ రెడ్డి, జడ్పిటిసి పద్మ నాగభూషణం గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.