నవతెలంగాణ దినప్రతికకు 9వ వార్షికోత్సవ శుభాకాంక్షలు

నవతెలంగాణ – సిరిసిల్ల
ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలిపేది నవ తెలంగాణ
రాష్ట్రంలో అనేక పత్రికలు పనిచేస్తున్నాయి వాటి వ్యాపారం రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయి వాటిలో నవ తెలంగాణ పత్రిక మాత్రం కేవలం ప్రజల ప్రయోజనాల కోసం ముఖ్యంగా ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలిపేలా వార్తలు రాస్తూ ఉంది నవ తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలి నవ తెలంగాణ పత్రికలో పనిచేసే విలేకరులు సిబ్బంది పత్రిక యాజమాన్యానికి వార్షికోత్సవ శుభాకాంక్షలు: చిక్కాల రామారావు, సెస్ చైర్మన్, సిరిసిల్ల
ప్రజల సమస్యలపై స్పందించి రాసేది నవ తెలంగాణ
సమాజంలో పత్రికల పాత్ర చాలా క్రియాశీలకమైంది మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల స్థితిగతులు సమాజంలో అరాచకాలు అసమానతలపైన నిర్భయంగా నవ తెలంగాణ వార్తలు రాస్తుంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అప్పటికప్పుడు మేమున్నామంటూ ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా పత్రిక ఉండాలని కోరుతున్నాము నవతెలంగాణ తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు:  కృష్ణ, సిఐ సిరిసిల్ల

శ్రామిక వర్గాన్ని చైతన్యవంతం చేసే పత్రిక నవ తెలంగాణ
నవ తెలంగాణ దినపత్రిక ప్రధానంగా సమాజంలోని కార్మికులు రైతులు యువకులు అట్టడుగు వర్గాలు మహిళల గొంతుకగా పనిచేస్తూ పాలకవర్గాల విధానాల మూలంగా ఉత్పన్నం అవుతున్న సమస్యలను ప్రమాదాలను పసిగట్టి శ్రామిక ప్రజానీకానికి అందించి చైతన్య పరుస్తున్నది కార్పోరేట్ అనుకూల విధానాలకు ప్రత్యామ్నాయంగా ప్రజల అనుకూల విధానాలను వార్తల రూపంలో ప్రచారంలో పెడుతుంది నవ తెలంగాణ దినపత్రిక రాబోయే రోజుల్లో మరింత పదునుగా పనిచేయాలని ఆకాంక్షిస్తున్నాము నవ తెలంగాణ పత్రికకు 9 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు: ఉమా శంకర్, సీనియర్ న్యాయవాది

ప్రజలకు అండగా నవతెలంగాణ
రాజకీయాలు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల మన్ననాలు పొందే విధంగా వార్తలు రాసేది నవ తెలంగాణ దినపత్రిక మాత్రమే ఈ రోజుల్లో ఒక్కో పత్రిక ఒక్కో పార్టీకి కొమ్ము కాసే విధంగా పనిచేస్తున్నాయి ఈ పరిస్థితుల్లో ఉన్నత వర్గాలకు కొమ్ముకాసే విధంగా కాకుండా ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా వారిని చైతన్యం చేసే విధంగా నవ తెలంగాణ దినపత్రిక విలేకరులు పనిచేస్తున్నారు. వారందరికీ తొమ్మిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు: మమత, అంగన్వాడి టీచర్
అన్ని రకాల వార్తలతో ముందుకు..
నవ ఆలోచనలతో రాజకీయాలు వ్యాపారం క్రీడలు కళ్ళలు వాతావరణం మొదలైన రంగాల వార్తలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు అదేవిధంగా అంతర్జాతీయ జాతీయ స్థానిక వార్తల మీద అవగాహన కల్పించినందుకు నవ తెలంగాణ పత్రిక యాజమాన్యానికి పాత్రికేయ మిత్రులకు సిబ్బందికి కృతజ్ఞతలు ఎండ వాన చలిని కూడా పోరాడి వాస్తవాల కోసం ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క రిపోర్టర్కు వందనాలు భవిష్యత్తులో మరింత ఉన్నతకి చేరుకోవాలని ఆశిస్తూ నవ తెలంగాణ పత్రికకు వార్షికోత్సవ శుభాకాంక్షలు:  శిరీష, ప్రైవేట్ ఉద్యోగి