ఘనంగా ఏబీవీపీ దినోత్సవం

నవతెలంగాణ-వీణవంక
ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని మండలంలో విద్యార్థులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ విద్యా రంగ సమస్యలపై ఏబీవీపీ పోరాటాలు చేస్తున్నదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అరవింద్, పిల్లి కుమార్, అభిలాష్, పరుశరాములు, సాయి తదితరులు పాల్గొన్నారు.