ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజు, జిల్లా అధ్యక్షుడు ఆనంపల్లి ఎల్లయ్య అన్నారు. నిజామాబాద్ నగరంలోని రైల్వే కమాన్ వద్ద గల జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు అని, ఆయన భారత దేశ ఉప ప్రధానిగా, వివిధ మంత్రి పదవులలో కొనసాగారని అన్నారు. జిల్లా కార్యదర్శి నంది వినయ్ కుమార్, కోశాధికారి నీలగిరి రాజు, ఉపాధ్యక్షులు భత్తుల కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.