ఘనంగా బాబు జగ్జీజీవన్ రామ్ జయంతి

నవతెలంగాణ – హాలియా 

అనుముల మండల పీఆర్ యూ టీ ఎస్ ఆధ్వర్యంలో, స్వాతంత్ర్యసమరయోధుడు , భారత మాజీ ఉప ప్రధాని,సమతావాది, బాబు జగ్జీజీవన్ రామ్ 116 వ జయంతి కార్యక్రమాన్ని హాలియా పట్టణంలోని బస్టాండ్ వద్ద శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీజీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి పీఆర్ యూ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పీఆర్ యూ టి ఎస్ ఉపాధ్యక్షులు మందా సైదులు రావు గౌతమ్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ పిలుపు మేరకు దేశ స్వాతంత్య్ర సాధన కోసం బ్రిటిషు పాలకులకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో క్రియాశీలకంగా పాల్లొన్న గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు జగ్జీజీవన్ రామ్ అని, స్వాతంత్ర్యనంతరం భారతదేశ ఉప ప్రధాని గా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా మరియు రక్షణశాఖ మంత్రి గా, కార్మిక శాఖ మంత్రిగా దేశ అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు అమలు చేసిన గొప్ప పరిపాలనాదక్షుడు బాబు జగ్జీజీవన్ రామ్ అని,ఆయన జీవితాంతం అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నతుడు అని ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పీఆర్ యూ టి ఎస్ నల్లగొండ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు మేదరి దేవేందర్, జిల్లా ఉపాధ్యక్షులు ఇరుమాది పాపిరెడ్డి, తిరుమలగిరి సాగర్ మండల పీఆర్ యూ టి ఎస్ అధ్యక్షులు మొక్క పరుశ్ రామ్ గౌడ్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.