సోదర సోదరీమణులకు బక్రీద్ శుభాకాంక్షలు

నవతెలంగాణ- రాయపోల్

త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగ అల్లా దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని  ఈద్- అల్- అదా (బక్రీద్‌) పండుగ సందర్బంగా ఎస్ ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు . త్యాగం, సహనం ఈ పండుగ ఇచ్చే మంచి సందేశాలన్నారు.దాన ధర్మాలకు ప్రతీక బక్రీద్ పండుగ అని అన్నారు.త్యాగం, సేవకు చిహ్నంగా  బక్రీద్ పండుగ నిలుస్తుంది అన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ పండుగ జరుపుకొంటారన్నారు. భక్తి భావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలన్నారు. ఈ పండుగ సోదర భావం,ఐక్యతకు ఆదర్శంగా నిలుస్తుంది అని అన్నారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని అభిలషించారు. అల్లా దయతో ప్రజలందరూ సుబిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.