నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ 12 వ వర్ధంతి ని బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన యాదిలో ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు ముబారక్ బాబా, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు నరసింహారావు, రాంబాబు, సలీమ్, మైనారిటీ గురుకులం ప్రిన్సిపాల్ సంగీత, ప్రింట్ & ఎలక్ట్రానిక్ పాత్రికేయులు, ఉద్యమకారులు,విద్యార్థినిలు ఆయన యాదిలో విద్యార్థినిలు జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించారు. తెలంగాణ కల సాకారం కాక మునుపే ఆయన కను మూయడం విచారకరం, తెలంగాణ ఉద్యమం లో ఆయన విద్యార్థి దశ నుండి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పదవి లో ఉండి చనిపోయే వరకు రాష్ట్ర ఏర్పాటుకోసం వీరోచిత పోరాటం చేసిన పాత్ర మరువలేనిది. నేడు బంగారు తెలంగాణలో ఉన్న యావత్ తెలంగాణ జాతి ఆయనను సదా యాది చేసుకోవాలని వక్తలు కొనియాడారు.