తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని సర్ విగ్రహానికి మిర్యాల కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ సార్ విద్యార్థి దశ నుండి ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమ తొలి దశ తెలంగాణ ఉద్యమం నుండి మలిదశ ఉద్యమంలో పాల్గొని తుది శ్వాస విడిచే వరకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఎనలేని కృషి చేశారు. ఎంతోమంది విద్యార్థులకు భవిష్యత్ పాఠాలు ఉద్యమ స్ఫూర్తిని నింపడం రాజకీయ పార్టీల తోనే రాష్ట్ర సిద్ధిస్తుందని నీళ్లు, నియామకాలు, నిధులు అనే నినాదంతో రాష్ట్ర ప్రజలందరికీ ఏకం చేసి రాష్ట్ర ఏర్పాటు కాకముందే ప్రాణాలను విడిచిన జయశంకర్ సార్ కు జోహార్లు అర్పిస్తూ వచ్చే జయశంకర్ జయంతి దినం మద్యం, మాంసం రాష్ట్ర ప్రభుత్వం బందు చేయాలని కోరారు. కార్యక్రమంలో కాడబోయిన రవి కొమ్ముల శ్రవణ్ పెరుమాండ్ల ప్రభాకర్ మోర బాలకృష్ణ దేవేందర్ పాల్గొనడం జరిగింది.